Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ | Vishnu Vinyasam Review by Censor Board: CBFC Clears Sree Vishnu Movie with UA16+ certificate

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ స్టార్ హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం. కమెడియన్ సత్య, మురళీశర్మ, బ్రహ్మజీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించారు. కామెడీ, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుమంత్ నాయుడు నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమాకు రధన్ మ్యూజిక్ అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీకేయన్ రోహిణి ఎడిటర్‌గా, ఏ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 27 తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్లను 26వ తేదీన ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ మూవీ గురించి సెన్సార్ బోర్డు (CBFC) జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

విష్ణు విన్యాసం కథ విషయానికి వస్తే.. ఒంగోలుకు చెందిన విష్ణు (శ్రీవిష్ణు) లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అతడికి న్యూమరాలజీ, వాస్తు, జాతకాల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. అలాంటి విష్ణుకు జున్ను (నయన సారిక)తో పరిచయం ఏర్పడుతుంది. అయితే జున్నుకు పెళ్లి అంటే ఓ రకమైన భయం ఉంటుంది. అలాంటి అమ్మాయితో వాస్తు పిచ్చి ఉన్న విష్ణు ప్రేమలో పడుతాడు. అయితే వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు, అభిరుచులు వారిని కలిపాయా? వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరకు జున్ను, విష్ణుకు పెళ్లి అయిందా? అనేది సినిమా కథ.

విష్ణు విన్యాసం సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లలోని డైలాగ్స్‌పై స్వల్ప అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. చిత్ర యూనిట్ వాటిని సవరించిది. దాంతో సంతృప్తి చెందిన అధికారులు, ప్రతినిధులు ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఫన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, వాస్తు సంబంధింత అంశాలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను కలిగించేలా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని సెన్సార్ ప్రతినిధులు వ్యక్తం చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ(UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. దీని ప్రకారం 16 ఏళ్లకుపై బడిన ఆడియెన్స్ అంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మూవీని చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా నిడివిని మీర ఎక్కువ కాకుండా కథ డిమాండ్ చేసిన మేరకు ఫిక్స్ చేశారు. కామెడీ, డ్రామా, రొమాంటిక్‌గా రూపొందిన ఈ సినిమా నిడివి 2 గంటల 7 నిమిషాలు. అంటే మొత్తంగా 127 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

విష్ణు విన్యాం సినిమా కామెడీ ఆధారితంగా నడిచే సినిమా. న్యూమరాలజీ బ్యాక్ డ్రాప్‌తో హీరో పండించే ఫన్ ఆకట్టుకొనేలా ఉంటుంది. లవ్ ట్రాక్, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫస్టాఫ్‌ యూత్‌ను టార్గెట్ చేసి డిజైన్ చేశాం. సెకండాఫ్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. సిచ్యువేషనల్ సాంగ్స్ ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ అవుతాయి అని నిర్మాతలు సుమంత్ నాయుడు, సుబ్రమణ్యం నాయుడు తెలిపారు.

Disclaimer: This content was automatically imported from a third-party source via RSS feed. The original source is: https://telugu.filmibeat.com/reviews/vishnu-vinyasam-review-by-censor-board-cbfc-clears-sree-vishnu-movie-with-ua16-certificate-167361.html. xn--babytilbehr-pgb.com does not claim ownership of this content. All rights remain with the original publisher.

We will be happy to hear your thoughts

Leave a reply

Babytilbehør
Logo